ICC T20I rankings : ఇంగ్లాండ్‌పై మెరుపు శతకం.. ఏకంగా 38 స్థానాలు ఎగబాకిన అభిషేక్

by Harish |   ( Updated:2025-02-05 11:52:11.0  )
ICC T20I rankings : ఇంగ్లాండ్‌పై మెరుపు శతకం.. ఏకంగా 38 స్థానాలు ఎగబాకిన అభిషేక్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ను భారీ మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంల అభిషేక్ ఏకంగా 38 స్థానాలను ఎగబాకాడు. 40వ స్థానంలో ఉన్న అతను 2వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అతను 279 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదో టీ20లో రెచ్చిపోయిన అభిషేక్ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతని ర్యాంక్ మెరుగుపడింది. అగ్రస్థానంలో ఉన్న ట్రావిస్ హెడ్‌కు అభిషేక్ కేవలం 26 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. భారత్ నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్-5లో కొనసాగుతుండటం విశేషం.

తిలక్ 3వ స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ 5వ స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో విఫలమైన సంజూ శాంసన్ 5 స్థానాలు కోల్పోయి 3వ ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 5 స్థానాలు అధిగమించి 51వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే, శివమ్ దూబె ఏకంగా 38 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 58వ స్థానంలో ఉన్నాడు. అలాగే, బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ కూడా తమ ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నారు. వరుణ్ 3స్థానాలు వెనక్కినెట్టి 2వ ర్యాంక్‌కు, బిష్ణోయ్ 4 స్థానాలు అధిగమించి 6వ ర్యాంక్‌కు చేరుకున్నారు. అర్ష్‌దీప్ 9వ స్థానంలో ఉన్నాడు.


Next Story