- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని జట్లు ఇవే.. ఈ సారైనా అదృష్టం వరించేనా?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 మరో వారం రోజుల్లో ప్రారంభకానుంది. ఈ నెల 22 నుంచి టోర్నీకి తెరలేవనుంది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటివరకు 16 సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే, కొన్ని జట్లు ఇప్పటికీ తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట్సల్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు చాంపియన్‌గా నిలువలేకపోయాయి. మరి, ఐపీఎల్-17 సీజన్‌లోనైనా ఈ మూడు జట్లు తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించుతాయో లేదో చూడాలి.
ఆర్సీబీ ఈ సారైనా?
ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లోనూ బెంగళూరు జట్టును దురదృష్టం వెంటాడుతోంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. స్టార్ ఆటగాళ్లు కూడా ఆ జట్టు సొంతం. అయినప్పటికీ ఇప్పటివరకూ ఆ జట్టు టైటిల్ గెలుచుకోలేకపోయింది. 2009, 2011, 2016 సీజన్లలో తుది మెట్టుపై బోల్తా పడింది. ప్రతి సీజన్‌లోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగడం ఏదో ఒక దశలో నిరాశపర్చడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేదు. 6వ స్థానంతో సరిపెట్టింది. కోహ్లీ నుంచి డుప్లెసిస్ పగ్గాలు చేపట్టినా జట్టుది అదే పరిస్థితి. ఈ సీజన్‌లో సత్తాచాటాలని భావిస్తున్నది. ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పేపర్‌పై బలంగా ఉందనే చెప్పాలి. విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్, గ్లెన్ మ్యా్క్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ వంటి హిట్టర్లను కలిగి ఉండటం ఆ జట్టు ప్రధాన బలం. అలాగే, సిరాజ్, ఆకాశ్ దీప్, అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్, వైశాక్ విజయ్ కుమార్ వంటి నాణ్యమైన బౌలర్లు కలిగి ఉన్నారు. ఈ నెల 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నయ్‌తో ఆర్సీబీ తలపడనుంది.
పంత్ రిటర్న్
ఢిల్లీ క్యాపిటల్స్‌ది మరో రకమైన పరిస్థితి. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్కసారి మాత్రమే ఫైనల్ వరకు వెళ్లింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ 2020లో ఫైనల్‌కు చేరినా అక్కడ ముంబై చేతిలో ఓడింది. ఇక, 2021లో ప్లే ఆఫ్స్‌కే పరిమితమవ్వగా.. గత రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదం కారణంగా గత సీజన్‌కు దూరమవ్వగా.. వార్నర్ నాయకత్వంలో ఆ జట్టు చెత్త ప్రదర్శతో 9వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌కు పంత్ తిరిగి రావడం ఆ జట్టుకు ప్రధాన బలం కానుంది. 2021లో పగ్గాలు చేపట్టిన తొలి సీజన్‌లోనే ఢిల్లీని ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. బ్యాటింగ్ పరంగా ఢిల్లీ.. పంత్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పృథ్వీ షాలపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది. ఇటీవల వార్నర్, మిచెల్ మార్ష్ పొట్టి ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. పృథ్వీ షా ఫామ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అందరి దృష్టి పంత్‌పైనే ఉన్నది. దాదాపు 14 నెలల విరామం తర్వాత అతను మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. మరి, ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ముకేశ్ కుమార్, నోర్జే, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ వంటి బౌలర్లతో ఢిల్లీకి బౌలింగ్ ఆప్షన్లు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నెల 23న పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
లక్నోపై మంచి అంచనాలు
2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆ సీజన్‌తోపాటు గతేడాది మంచి ప్రదర్శననే చేసింది. వరుసగా రెండు సార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కేఎల్ రాహుల్ నాయకత్వంలోనే లక్నోపై ఈ సీజన్‌లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. రాహుల్, క్వింటాన్ డికాక్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్‌లతో బ్యాటింగ్ దళం బలంగా ఉంది. కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లను కలిగి ఉండటం అదనపు బలం. నవీన్ ఉల్ హక్, డేవిడ్ విల్లీ, శివమ్ మావి, యశ్ ఠాకూర్, మోహ్సిన్ ఖాన్, బిష్ణోయ్‌లతో బౌలింగ దళం కూడా పటిష్టంగానే కనిపిస్తున్నది. ఈ నెల 24న లక్నో జట్టు తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.
పంజాబ్ కింగ్స్ సత్తాచాటేనా?
మంచి అంచనాలతో బరిలోకి దిగడం చెత్త ప్రదర్శన మూటగట్టుకోవడం పంజాబ్ కింగ్స్‌కు అలవాటుగా మారింది. 16 సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్‌లో అడుగుపెట్టింది. 2014లో టైటిల్ పోరుకు అర్హత సాధించినా కోల్‌కతా చేతిలో ఓడిపోయింది. మొత్తంగా లీగ్‌లో ఆ జట్టు రెండుసార్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరుకుందంటే పంజాబ్ ప్రదర్శనపై ఓ అంచనాకు రావొచ్చు. గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. గతేడాది శిఖర్ ధావన్ నాయకత్వంలో ఆ జట్టు 8వ స్థానంతో సరిపెట్టింది. ఈ సీజన్‌లో పుంజుకుని సత్తాచాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. ధావన్, బెయిర్ స్టో, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మలతో బ్యాటింగ్ దళం పేపర్‌పై బలంగానే కనిపిస్తున్నది. అయితే, నిలకడలేమి ఆ జట్టుకు ప్రధాన సమస్య. ఈ సీజన్‌లో ఆ సమస్యను అధిగమిస్తుందో లేదో చూడాలి. బ్యాటింగ్ దళంతో పోలిస్తే బౌలింగ్ దళం జట్టుకు ప్రధాన బలం. రబాడ, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కర్రన్, నాథన్ ఎలిస్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్ వంటి నాణ్యమైన బౌలర్లు ఆ జట్టు సొంతం. మరి, ఈ సీజన్‌లో పంజాబ్ తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందో లేదో చూడాలి. ఈ నెల 23న ఢిల్లీతో పోరుతో పంజాబ్ టోర్నీని ప్రారంభించనుంది.
- Tags
- #ipl 2024