2007 T20 world cup: పాక్ పై భారత్ సంచలన విజయానికి సరిగ్గా 17 ఏళ్లు

by Mahesh |   ( Updated:2024-09-14 14:04:08.0  )
2007 T20 world cup: పాక్ పై భారత్ సంచలన విజయానికి సరిగ్గా 17 ఏళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ప్రారంభం అయినప్పటి నుంచి భారత(India) జట్టు తమ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్(Pakistan) జట్టుపై నేటికి పైచేయి సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మొట్ట మొదటి టీ20 ప్రపంచకప్‌ సీజన్‌(2007 T20 world cup)లో భారత్ అనేక అనూహ్య విజయాలను అందుకుంది. ఇందులో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బాల్ అవుట్, బౌల్ అవుట్(Bowl out)(సూపర్ ఓవర్) మ్యాచ్ అయితే మొత్తం సీజన్ కు హైలెట్ గా నిలిచింది. కాగా ఈ మ్యాచ్ జరిగి నేటికి సరిగ్గా 17 సంవత్సరాలు అవుతుంది. దీంతో నేడు ఈ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటు అభిమానులు పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కాగా ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సుదీర్ఘంగా చర్చించి అంపైర్లు బౌల్ అవుట్(Super over) పద్దతిని పెట్టారు. ఇందులో భారత్ బౌలర్లు వరుసగా మూడు బంతుల్లో మూడు సార్లు వికెట్లు పడగొట్టగా.. పాకిస్తాన్ బౌలర్లు(Pakistan bowlers) మాత్రం ఒక్కరు కూడా నేరుగా వికెట్లను కొట్టలేకపోయారు. దీంతో ఆ మ్యాచ్ లో భారీ విజయం సాధించింది. కాగా ఈ సీజన్ లో భారత్ మళ్లీ పాకిస్తాన్ జట్టుపై 2007 సెప్టెంబర్ 24న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అనూహ్య విజయం సాధించింది. దీంతో భారత్ మొట్టమొదటి టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed