- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పోర్ట్స్ కోటాకు మంగళం..!
ప్రభుత్వ ఆదరణకు నోచుకోని స్కూల్ గేమ్స్
ప్రపంచంలో ఎంత గొప్ప క్రీడాకారుడైనా పాఠశాల స్థాయి నుంచే తన క్రీడాప్రయాణాన్ని మొదలెడతాడు. పీఈటీలు, కోచ్‌లు చిన్నతనంలో ఒక క్రీడాకారుడి ప్రతిభ గుర్తించడం ద్వారా.. ఆ తర్వాత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు. పాఠశాల క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపించిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా వారికి స్పోర్ట్స్ కోటాలో విద్య, ఉద్యోగ అవకాశాలు లభించేవి. కానీ ఏడాదిన్నరగా తెలంగాణలో స్పోర్ట్స్ కోటా అమలు కావడం లేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పాఠశాల క్రీడల్లో పాల్గొన్న వారి సర్టిఫికెట్లను స్పోర్ట్స్ కోటాలో పరిగణించడల లేదు. దీనికి ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జీవో నెంబర్ 7 కారణం.
ప్రభుత్వం 2018లో తొలుత విడుదల చేసిన జీవో నెంబర్ 7, ఆ తర్వాత సవరణలతో విడుదల చేసిన జీవో నెం 4 వల్ల పాఠశాల స్పోర్ట్స్ కోటాకు రెక్కలొచ్చాయి. దీని ద్వారా కేవలం అసోసియేషన్ల తరఫున ఆడిన ఆటగాళ్లకు మాత్రమే స్పోర్ట్స్ కోటా వర్తిస్తోంది. ఏడాదిన్నరగా జాతీయ స్థాయి అండర్ 14, 17, 19లలో రాణించినా వారికి ఎలాంటి స్పోర్ట్స్ కోటా అమలు కావట్లేదు. దీంతో వారికి నష్టం కలుగుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అసోసియేషన్ల తరపున ఆడిన వారికే ఉన్నత విద్య, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా అవకాశాలు దక్కతున్నాయి. కానీ అసోషియేషన్ల తరఫున ఆడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. పైగా క్రీడాకారులందరికీ అసోసియేషన్ల తరపున ఆడే అవకాశాలు దక్కవు. దీంతో పాఠశాల క్రీడలకు ఆదరణ కరువవుతోంది. ఈ క్రమంలో అందరూ అసోసియేషన్ల తరపున ఆడేందుకే ప్రయత్నిస్తున్నారు.
స్వయంకృతమే..
స్పోర్ట్స్ కోటాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సర్టిఫికెట్లు రద్దు కావడానికి ఆయా జిల్లా మేనేజర్లు, కోచ్‌లే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయి పాఠశాల క్రీడా పోటీలకు నాసిరకం జట్లను, నైపుణ్యం లేని క్రీడాకారులను పంపడం మూలాన పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కొంత మంది కోచ్‌లు, మేనేజర్లు విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలకు దిగి అసలు ఆటలే రాని వారిని సర్టిఫికెట్ల కోసం ఆడిస్తున్నారు. ఈ తప్పులను గుర్తించిన ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను రద్దు చేసేసింది. దీంతో అసలైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోంది. అయితే కేంద్రం ఇటీవలే పాఠశాల క్రీడా కోటాపై మార్గదర్శకాలు ప్రకటించింది. దీని ప్రకారం జాతీయ స్థాయిలో తొలి మూడు స్థానాలు పొందిన జట్లు, క్రీడాకారులకు మాత్రమే సర్టిఫికెట్లు లభిస్తాయి. ఈ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్పోర్ట్స్ కోటాను తిరిగి పునరుద్ధరించాలని.. తద్వారా నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
పాఠశాల క్రీడలను ఆదరించాలి..
రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపిక కమిటీలను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయాల్సిన అవసరం ఉంది. సిఫార్సులు, లంచాల ద్వారా ఎంపికయ్యే క్రీడాకారులను గుర్తించి వారిపై నిషేధం విధించాలని.. రాష్ట్ర స్థాయి అధికారులు స్వయంగా పర్యవేక్షించి నిజమైన క్రీడాకారులను పాఠశాల స్థాయిలో గుర్తించాలని కోరుతున్నారు. జిల్లా కమిటీల్లో ఉండే సభ్యులకు అసలు క్రీడలపై అవగాహన లేకుండా పోతోందని.. మాజీ క్రీడాకారులను సభ్యులుగా చేర్చితే ఎంపికలు సరిగ్గా జరుగుతాయని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం క్రీడా కమిటీల్లో అనుభవం ఉన్న వారిని నియమించాలని కోరుతున్నారు.
Tags: Sports Quota, School level Games, Players, Coaches, Certificate, GO No. 7