- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ ఐడియా సూపర్.. మన దగ్గర అమలు చేస్తే బాగుండు అంటున్న ప్రజలు

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటే చాలా వరకు జనం వెనకడుగు వేస్తారు. కొన్ని ఆసుపత్రుల్లో అయితే పరిశుభ్రత లేక మరి అధ్వానంగా ఉంటుంది. కానీ కేరళ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య కోసం వచ్చే పేషెంట్ల ఇబ్బందులను తెలుసుకుని మంచాలపై వేసే బెడ్ షీట్లపై రోజు వారి పేర్లను ముద్రింపజేసింది. దీంతో ఏరోజుకారోజు బెడ్ షీట్లు అక్కడ సిబ్బంది మారుస్తున్నారా లేదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
అక్కడి ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టడంతో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వీటిని అమల్లోకి తేవాలంటూ ప్రజలు తమ విజ్ఞప్తులను తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వ్యాప్తి చెందడంతో మన రాష్ట్రంలో కూడా వీటిని అమల్లోకి తేవాలి అంటూ ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. అస్సాంలో కూడా అక్కడి ప్రభుత్వం ఇదే తరహా తీరును అమల్లోకి తెచ్చింది. అయితే మన రాష్ట్రంలో కలర్ కోడింగ్ పేరిట గతంలో రోజువారీ బెడ్ షీట్లు మార్చే విధంగా కార్యాచరణ మొదలుపెట్టారు. కానీ అది సాధ్యం పడకపోవడంతో ఆ పనులు ఆదిలోనే ఆగిపోయాయి.