- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ.. ఆ అంశాలపైనే ఫోకస్!

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ మలిదశ విచారణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ దఫా విచారణలో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ (Justice Pinaki Chandra Ghosh) గత బీఆర్ఎస్ సర్కార్ (BRS Government)లో సదరు ప్రాజెక్టుల నిర్మాణాలకు బాధ్యులుగా వ్యహరించిన వారికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేసి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన నిధులపై మలిదశ విచారణలో ప్రధానంగా ఆరా తీయనున్నట్లుగా సమాచారం. అయితే, ఈ నెలాఖరుతో కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) గడువు ముగియనుండటంతో మరో రెండు నెలల వ్యవధితో గడువును పొడిగిస్తూ సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari) అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.