- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు ఆ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు ఇవాళ(గురువారం) విజయవాడ వెళ్లనున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Narayana) రెండో కుమారై శరణి(Sharani) రచించిన ‘మైండ్సెట్ షిఫ్ట్’(Mindset Shift) పుస్తక ఆవిష్కరణ ఈ రోజు(ఏప్రిల్ 24)న జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4.30గంటలకు విజయవాడ(Viajayawada) ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో పుస్తక ఆవిష్కరణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu), నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) పాల్గొననున్నారు.
ఈ తరుణంలో పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు.. తొలి కాపీని చిరంజీవికి అందజేయనున్నారు. ఈ పుస్తకంలో ఆలోచనా విధానంలో మార్పులతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని శరణి చాలా అద్భుతంగా వివరించారు. మనం ఉదయం లేచిన వెంటనే ఏ విషయంలోని నిరాశ చెందకుండా అంటే ఒక దినచర్య మొదట సంతోషంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలను ఈ బుక్‌లో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు చెబుతున్నారు.
Read More..
హ్యాపీ బర్త్‌డే మై సూపర్ హీరో అంటూ అతనికి విష్ చేసిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫొటోలు