ఆ జిల్లాలో గజరాజుల బీభత్సం.. లారీ అద్దాలు ధ్వంసం

by Jakkula Mamatha |
ఆ జిల్లాలో గజరాజుల బీభత్సం.. లారీ అద్దాలు ధ్వంసం
X

దిశ,వెబ్‌డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో మరోసారి గజరాజులు బీభత్సం స్పష్టించాయి. ఇప్పటికే పలుమార్లు కొబ్బరి తోటను ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఏనుగులు అక్కడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగుల సంచారంతో పలు చోట్ల పంట పొలాలు ధ్వంసం అయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలో ఏనుగులు సంచారించాయి.

ఈ తరుణంలో రోడ్డు మీదకు గుంపులు గుంపులుగా వచ్చిన గజరాజులు చింతపండు లోడ్ లారీని అడ్డగించాయి. ఈ క్రమంలో లారీ అద్దాలు ధ్వంసం చేశాయి. ఇక ఏనుగుల గుంపు దాడిలో లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అయితే తరచూ ఏనుగుల సంచారంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపు నుంచి తమ ప్రాణాలు రక్షించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed