- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోనూ.. సరిలేరు నీకెవ్వరూ!
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో సోనూ సూద్ వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యాడు. ఒక్క మేసేజ్ చేస్తే వెంటనే వారి అవసరాన్ని తీర్చి బాధితులకు భగవంతుడయ్యాడు. లాక్‌డౌన్‌లో ఆయన చేసిన సేవతో రీల్ విలన్ కాస్తా రియల్ హీరోగా మారాడు. దీంతో సోనూ సూద్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు చేయలేని పని ఓ సెలబ్రిటీ చేశాడని ప్రజానీకం కొనియాడింది.
అయితే, సోనూ తన సేవను కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా కిర్గిజ్‌స్థాన్‌లో ఉన్న 1500 మంది భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రముఖ ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్‌తో ఒప్పందం చేసుకున్నాడు. కాగా, ఇప్పటికే ఢిల్లీ నుంచి కిర్గిస్థాన్‌కు 9 విమానాలు బయల్దేరాయి. ఈ విషయాన్ని స్పైస్ జెట్ తన అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ వార్త విన్న నెటిజన్లు సోనూ సూద్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.
Advertisement
Next Story