డెలివరీల్లో సరికొత్త స్టైల్!

by Shyam |
డెలివరీల్లో సరికొత్త స్టైల్!
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన సంక్షోభంతో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అనే పరిశ్రమలు, సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త తరం ఉద్యోగాలకు సిద్ధం చేశాయి. దీని వల్ల సంస్థకు, ఉద్యోగులకూ లాభాలున్నాయి. ఇక లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రిటైల్ దిగ్గజం స్పెన్సర్..క్యాబ్ సర్వీసుల దిగ్గజం ఉబర్..రెండు సంస్థలూ సంయుక్తంగా కస్టమర్ల కోసం కలిసి పనిచేయనున్నాయి. కస్టమర్లకు అవసరమైన సరుకులను చేరవేయడానికి ఒప్పందం కూడా చేసుకున్నాయి. ఇక మీదట స్పెన్సర్ స్టోర్ల నుంచి నిత్యావసరాలను ఆర్డర్ చేసుకున్న ఆర్డర్ల ప్రకారం క్యాబ్‌లలో డెలివరీ చేయనున్నారు. ఈ సేవలు దేశవ్యాప్తంగా అందించనున్నట్టు స్పెన్సర్ వెల్లడించింది. ఇదివరకే లక్నో, కోల్‌కతా వంటి నగరాల్లో ప్రయత్నాలు జరిపారు. అక్కడ విజయవంతంగా జరిగిన తర్వాతే మిగిలిన చోట్ల ప్రారంభించడానికి సిద్ధమయ్యామని ప్రకటించారు. సాధారణంగా రిటైల్ స్టోర్ల నుంచి సరుకులను ఎక్కువగా టూవీలర్‌లో డెలివరీ జరుగుతాయి. ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో సరుకులను డెలివరీ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్పెన్సర్ స్టోర్‌తో కలిసి పనిచేయనున్నట్టు ఉబర్ ఇండియా డైరెక్టర్ అన్నారు. కస్టమర్లతో పాటు తమ సంస్థలో పనిచేసే డ్రైవర్లకు ఈ సమయంలో ఆదాయం కల్పించేందుకు ఈ నిర్ణయం ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. డ్రైవర్లకు ఆర్థికంగా ఆదుకునేందుకు వాటిపై ఎటువంటి కమీషన్లు తీసుకోవడం లేదంటూ ఆయన వివరించారు.

స్పెన్సర్ రిటైల్ స్టోర్స్ వారు దేశవ్యాప్తంగా సుమారు 160 వరకూ స్టోరలను నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సరుకులను సకాలంలో డెలివరీ చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సరుకులను డెలివరీ చేసే సమయంలో ఇబ్బందులు రాకుండా, వారి ఆరోగ్యానికి భధ్రతను కల్పిస్తూ క్యాబ్ డ్రైవర్లకు ఫేస్ మాస్కులు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లు అందజేస్తున్నట్టు సంస్థ స్పష్టం చేసింది. సంస్థ తరపున వీరికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తున్నట్టు ఉబర్ ఇండియా పేర్కొంది.

Tags: Uber, Coronavirus, Spencer’s Retail

Advertisement

Next Story

Most Viewed