Balaji Temple: ఆ ఆలయంలో దెయ్యాలు, ఆత్మలు.. లోపలికి వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదా?

by Vennela |   ( Updated:2025-03-06 16:28:46.0  )
Balaji Temple: ఆ ఆలయంలో దెయ్యాలు, ఆత్మలు.. లోపలికి వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదా?
X

దిశ, వెబ్‌డెస్క్: Balaji Temple: రాజస్థాన్‌(rajasthan)లోని ఓ చిన్న గ్రామం.. దాని పేరు మేహందీపూర్(Mehndipur). వెలుగు కన్నా చీకటి ఎక్కువగా కనిపించే ప్రదేశం. ఇక్కడ రాత్రిళ్లు ఎవరూ ఒంటరిగా తిరగరు. అలాంటి గ్రామంలో ఓ ఆలయం ఉంది. దాని మేహందీపూర్ బాలాజీ ఆలయం(Mehndipur Balaji Temple) అని పిలుస్తారు. రోజూ వందలాది మంది ఆ గుడికి వస్తుంటారు. కానీ వీళ్లంతా భక్తితోనే వస్తారని అనుకోవద్దు. కొందరు బాధితులుగా, ఇంకొందరు భయంతో ఈ ఆలయంలో అడుగుపెడుతుంటారు. ఎందుకంటే ఇది ఒక సామాన్య దేవాలయం కాదట. ఈ ఆలయంలో ఆత్మలు, భయంకరమైన శక్తుల ఉన్నాయని నమ్మేవారుంటారు. ఇక్కడ కాలుమోపిన ప్రతి వ్యక్తి ఏదో వింత అనుభూతిని పొందుతాడట.. ఏదో అసాధారణమైన శక్తి తమను వెంటాడుతోందన్న భావన కలుగుతుందని చెబుతారు.

ఏదో మంత్ర బలంతో నిండిన గాలి అక్కడ తిరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయం గోడలపై ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. అయితే ఈ నక్షత్రాల చాటున నీడలు కూడా నిలబడినట్లే కనిపిస్తాయి. ఎవరో చూస్తున్నారని అనిపిస్తుంది. అంతే కాదు.. ఆలయంలో అడుగుపెట్టినవారిలో కొందరు అక్కడే అసాధారణంగా ప్రవర్తిస్తారు. గట్టిగా కేకలు వేస్తారు..భయంకరమైన భాషలో మాట్లాడతారు.. ఒక్కోసారి విపరీతంగా ఊగిపోతారు.

ఇక్కడికి వచ్చే వారు కేవలం మొక్కు తీర్చుకునేందుకు రారు.. వారిని వెంటాడుతున్న శక్తుల నుంచి విముక్తి పొందటానికి వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది దెయ్యాలను తరిమేసే గుడి అని భక్తుల విశ్వాసం. ఒకసారి ఈ ఆలయం గడప తొక్కిన వారు వెనక్కి తిరిగి చూడకుండా బయటికి రావాలి. తిరిగి చూస్తే అంతే సంగతట. జీవితాన్ని వెనక్కి లాగే శక్తులు వెంటాడతాయట. ఇక ఇక్కడ కొందరు భక్తులు రాత్రి భోజనం చేయరు.

ఆలయంలో ఎవరైనా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తే తీసుకోరు. కారణం? ఆహారంలోనూ దెయ్యాల శక్తుల ఉంటాయన్నది వారు చెప్పే మాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గుడి నిబంధనలు భయాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ గుడిలో కొన్ని ప్రదేశాలు భక్తులకు అందుబాటులో ఉండవు. అక్కడ ఏముం ఎవ్వరికీ తెలియదు. ఇలా ఆలయం చుట్టూ ఉన్న భయానక కథలు ఉన్నాయి. కానీ సైన్స్ మాత్రం దీనికి కొన్ని సమాధానాలను వివరిస్తుంది.

దెయ్యం పట్టిందనుకునే వ్యక్తులకు స్కిజోఫ్రీనియా, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ లాంటి మానసిక వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. అక్కడి వాతావరణం వాళ్ల ప్రవర్తనను మరింత అసాధారణంగా మార్చవచ్చని సైంటిస్టులు చెబుతుంటారు. ఒక వ్యక్తి భయపడితే, చుట్టూ ఉన్నవారికి కూడా అదే అనిపిస్తుంది. అలాగే.. ఒకరిద్దరు అరవడం మొదలుపెడితే.. మిగతా వారిలో కూడా భయం వేగంగా వ్యాపించవచ్చు. దీన్ని మాస్ హిస్టీరియా అంటారు.

ఇక చీకటి ప్రదేశాల్లో మనిషి మనస్సు సాధారణంగానే భయాలను కలిగిస్తుంది. ఆ భయంతో నీడలు కదులుతున్నాయనే భ్రమే కలుగుతుంది. ఇటు భయం, నమ్మకం, మంత్రోచ్చారణలు కలిసినప్పుడు.. మానవ మెదడు ఒక దెయ్యపు అనుభూతిని సృష్టించగలవు. ఇది ప్లేసిబో ఎఫెక్ట్.. అంటే కొన్నిసార్లు జరగవచ్చు.. కొన్నిసార్లు అలా అనిపించకుండా కూడా ఉండొచ్చు. అది సంబంధిత వ్యక్తిపై ఆధారపడే ఫీలింగ్‌. ఇలా అటు నమ్మకాలు.. ఇటు సైన్స్‌ చెప్పే విషయాలు ఈ ఆలయాన్ని Most Haunted Templeగా ప్రసిద్ది చెందేలా చేశాయి.

Next Story