మోత్కూర్‌లో స్పెషల్ టీం.. కరోనాపై ఆరా

by Shyam |
మోత్కూర్‌లో స్పెషల్ టీం.. కరోనాపై ఆరా
X

దిశ తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ, డబ్ల్యూహెచ్వో స్పెషల్ టీం సభ్యులు ఆకస్మిక తనిఖీ చేసింది. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలోనే ఉన్న వార్డులను, పరిశుభ్రత ను పరిశీలించారు.

మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా చికిత్సపొందుతున్న వ్యక్తుల ఇళ్లను సందర్శించి వారిని పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని పాడిమెట్ల ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యుహెచ్వో స్పెషల్ టీం సభ్యులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి, డాక్టర్ జగన్ తో పాటు మోత్కూర్ పిహెచ్సి డాక్టర్ లు డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ చైతన్యకుమార్ ,ఫార్మసిస్ట్ చింతల సత్యనారాయణరెడ్డి, వైద్య సిబ్బంది రవి, లక్ష్మి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed