- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాజువాక నివురుగప్పిన నిప్పులా ఉందా?
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్టణం నివురుగప్పిన నిప్పులా ఉందా? కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందా? కరోనా ముప్పును రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోగలదా? ఇంతకీ వైజాగ్‌లో ఏం జరిగింది? ఏం జరిగే ప్రమాదముంది?
విశాఖపట్టణంలో మార్చి 24న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అల్లిపురానికి చెందిన వ్యక్తి మక్కా నుంచి వచ్చి కరోనా బారిపడ్డాడు. దీంతో ఆయనను ఛెస్ట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కరోనా సోకిందని నిర్ధారణకు ముందు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స నందించిన వారు సరైన భద్రతా చర్యలు తీసుకోలేదన్న ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే వారెవరికీ కరోనా సోకిన దాఖలాలు కనపడలేదు. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసే కరోనా బులెటిన్‌లో దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు వైజాగ్‌లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్యులు చెప్పే కరోనా ఇంక్యుబేషన్ పిరియడ్ ముగిసిపోతోంది. ఈ దశలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ మర్కజ్‌లో పాల్గొన్న వ్యక్తి గాజువాకలో చికెన్ క్రయ విక్రయాలు నిర్వహించారు. ఆయన కరోనా బారినపడ్డట్టు తేలింది. దీంతో ఆయన ఎవరెవరికి చికెన్ విక్రయించారు. దానిని తిన్నవారు, వండిన వారెవరికైనా కరోనా సోకిందా? అన్న ఆందోళన అక్కడ నెలకొంది.
అయితే గాజువాకలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కరోనా వైద్యమందించే డాక్టర్ల రక్షణకు సూట్లతో పాటు పరీక్షలు నిర్వహించే పీపీఈ కిట్లను వైజాగ్‌లోనే తయారు చేస్తున్నారు. మరోవైపు కరోనాకు వైద్యంగా అగ్రరాజ్యం పేర్కొనే హైడ్రో క్లోరోక్విన్ మాత్రలు సిద్ధంగా ఉంచుకుంది. ఇంకోవైపు గాజువాకలోని కుంచుమాంబ కాలనీ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అనుమానితులందర్నీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది.
మరోవైపు మూడోసారి సమగ్ర సర్వే చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలంటీర్లతో ఇంటింటి ఆరోగ్యం సర్వే చేయిస్తోంది. వైజాగ్‌లోకి ఇతరులెవ్వరినీ రానివ్వడం లేదు. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులను ఆధీనంలోకి తీసుకుంది. వైజాగ్‌లో ఐసోలేషన్ కేంద్రాలకు ఏఏ ఆసుపత్రులు సరైనవో గుర్తించింది. అలాగే వైజాగ్‌లో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లను సిద్ధం చేసింది. ఒక్కసారిగా కేసులు పెరిగినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంది.
Tags: visakhapatnam, corona virus, gajuwaka, vizag, chicken shop owner