- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి విరాళాల సేకరణకు కోసం ప్రత్యేక యాప్
దిశ, తెలంగాణ బ్యూరో : యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ పనుల పురోగతి, మహా సుదర్శన యాగం, వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై గురువారం అరణ్య భవన్‌లో దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు, కళ్యాణ కట్ట, దీక్షాపరులు మండపం, అన్న ప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టర్మినల్స్, తదితర నిర్మాణాల పురోగతిపై మంత్రి చర్చించారు.
మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ- మహా సుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల ఏర్పాట్లు, యాగశాలల నిర్మాణం, రుత్వికులకు బస చేసేందుకు విడిది, తదితర ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల తీరుపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాలన్నారు. అనంతరం ఎన్ఆర్ఐల నుంచి విరాళాల సేకరణకు T APP FOLIO ప్రత్యేక యాప్ ను మంత్రి ప్రారంభించారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ అనే ప్రత్యేక ఆప్షన్ ద్వారా యాదాద్రితో పాటు హైదరాబాద్ నగరంలోని బల్కంపేట్ ఎల్లమ్మ, పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ గణేష్ టెంపుట్, కర్మన్ ఘాట్ ఆలయాలకు ఎన్ఐఆర్ దాతలు విరాళాలను పంపవచ్చని తెలిపారు.
ఆలయాల నిర్మాణానికి రూ.44.98 కోట్లు
అరణ్య భవన్‌లో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. సర్వశ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్–సీజీఎఫ్) ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 130 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.44,98 కోట్లు, వీకర్ సెక్షన్ కాలనీల్లో 63 ఆలయాల నిర్మాణానికి రూ. 7.56 కోట్ల నిధుల మంజూరుకు సీజీఎఫ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. షాద్ నగర్‌లోని వేదపాఠశాల నిర్వహణకు రూ.5.43 లక్షలు కేటాయించేందుకు కమిటీ అంగీకరించదని వెల్లడించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈవో గీతారెడ్డి, అర్కిటెక్ట్ ఆనంద్ సాయి, అదనపు కమిషనర్ కె.జ్యోతి, డిఫ్యూటీ కమిషనర్ రామకృష్ణ, వేములవాడ ఈవో కృష్ణప్రసాద్, బాసర ఆలయ ఈవో వినోద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.