నంది విగ్రహం ధ్వంసం కేసులో కొత్తకోణం..

by srinivas |
నంది విగ్రహం ధ్వంసం కేసులో కొత్తకోణం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గంగాధర నెల్లూరు మండలం ఆలయంలోని నంది విగ్రహం ధ్వంసం కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పలువురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జిల్లా పోలీసు యంత్రాంగం అనుమానం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా నంది విగ్రహం ధ్వంసానికి గురైందని పోలీసులు భావిస్తున్నారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో పలువురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని.. ఈ కేసులో మొత్తం 50 మంది ప్రమేయం ఉన్నట్లు వారు నిర్దారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే దీనిపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ఏకంగా జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ రంగంలోకి దిగారు. గంగాధర నెల్లూరు మండలంతో పాటు పాల సముద్రం మండలానికి చెందిన సుమారు 50 మందిని గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. మూడు గంటలుగా ఈ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనను ఎస్పీ సెంథిల్ కుమార్ సీరియస్‌గా తీసుకోవడంతో పాటు స్వయంగా తానే విచారణ చేపట్టడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed