‘బ్యాంకింగ్ వ్యవస్థ కోలుకునే అవకాశాల్లేవు’

by Shyam |
‘బ్యాంకింగ్ వ్యవస్థ కోలుకునే అవకాశాల్లేవు’
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు కోలుకోవడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్‌ పీ వెల్లడించింది. ప్రస్తుతం 2019 నాటి స్థాయిలో నెమ్మదిగా కోలుకుంటున్నాయని, పూర్తి స్థాయి రికవరీ 2023 వరకు సాధ్యం కాదని రేటింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ‘గ్లోబల్ బ్యాంకింగ్;రికవరీ 2023 బియాండ్’ పేరుతో వెలువరించిన తాజా నివేదికలో..ప్రస్తుత ఏడాదిలో కొవిడ్-19 వ్యాప్తితో పాటు అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరల షాక్ కారణంగా బ్యాంకులపై అత్యధిక ప్రభావం పడిందని పేర్కొంది.

కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా వందల ప్రతికూల రేటింగ్ చర్యలు తీసుకుంది. ఆర్థిక సంస్థలు కరోనా సంక్షోభానికి పూర్వం ఉన్న స్థాయికి తిరిగి చేరుకోవడం కష్టమని భావిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. 2023 వరకు కొవిడ్-19కి ముందున్న స్థాయికి రావడం గీ20 దేశాల్లోని సగానికి పైగా దేశాలకు సాధ్యపడకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకింగ్ ఆర్థిక పోకడలపై ప్రతికూలంగా సవరించామని ఎస్ అండ్ పీ తెలిపింది.

ఈ ధోరణి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంది. యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా సహా అనేక ప్రముఖ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా 2023 వరకు కోలుకునే అవకాశాల్లేవని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. భారత్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలు కోలుకోవడం చాలా ఆలస్యమవుతుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed