భారత వృద్ధి రేటును సవరించిన ఎస్ అండ్ పీ గ్లోబల్!

by Harish |
భారత వృద్ధి రేటును సవరించిన ఎస్ అండ్ పీ గ్లోబల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 9 శాతం నుంచి 7.7 శాతం ప్రతికూలానికి సవరిస్తున్నట్టు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ మంగళవారం వెల్లడించింది. ‘కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తొందరగా కోలుకుంటున్న తరుణంలో తాము ఈ అంచనాలను సవరిస్తున్నట్టు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వృద్ధి రేటు 7.7 శాతం ప్రతికూలంగా ఉంటుందని ఎస్ అండ్ పీ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత వృద్ధి ఊహించిన దానికంటే వేగంగా నమోదైందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 10 శాతం సానుకూలంగా పుంజుకోగలదని పేర్కొంది.

కరోనా వైరస్‌తో జీవించడం భారత్ నేర్చుకుందని, కొవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గిపోతోందని పేర్కొంది. ఇటీవల పండుగ సీజన్ సమయంలో పెరుగుతుందని భావించినప్పటికీ అలా జరగలేదని అందుకే తమ అంచనాలను సవరించక తప్పలేదని ఎస్ అండ్ పీ తెలిపింది. ఉత్పత్తి రంగం కూడా ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటోందని, ఆసియా-పసిఫిక్ అంతటా పలు ఆర్థికవ్యవస్థల్లో ఉన్నట్టుగా ఉత్పత్తి రంగంలో ఈ రికవరీ ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ షాన్ రోచె చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed