- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ కొరియాలో లాక్‌డౌన్‌లోనే ఎన్నికలు
సియోల్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలెవరినీ ఇండ్లు వదలి బయటకు రానివ్వకుండా నిబంధనలు పెట్టాయి. ఒక వేళ వచ్చినా భౌతిక దూరం పాటించాలననే నియమం ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది శ్రీలంక, బ్రిటన్, ఫ్రాన్స్, ఇథియోపియా దేశాల్లో పార్లమెంటు ఎన్నికలు జరగాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు మూకుమ్మడిగా బయటకు వస్తారని.. దీంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందనే ఆందోళనలతో వాయిదా వేశారు. అయితే, దక్షిణ కొరియా మాత్రం లాక్‌డౌన్‌లోనూ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. బుధవారం దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించింది. 300 సీట్లు కలిగిన దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీ(పార్లమెంటు)కి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు మూన్ జేయిన్ నేతృత్వంలోని అధికార డెమోక్రటిక్ పార్టీ 180 సీట్లు గెలుచుకొని తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్‌లకు లక్షలాది మంది ఓటర్లు మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 30 ఏండ్లలో ఎప్పుడూ నమోదు కాని పోలింగ్ శాతం ఈ కరోనా లాక్‌డౌన్ సమయంలో నమోదు కావడం గమనార్హం. 1992లో జరిగిన ఎన్నికల్లో 71.9 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత భారీ స్థాయిలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడం ఇదేనని అధికారులు చెబుతున్నారు. బుధవారం 66.2 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా 1987లో దక్షిణ కొరియా రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తర్వాత ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం కూడా ఇదే తొలిసారి. గత ఎన్నికల్లో 120 సీట్లు మాత్రమే రాగా.. ఈ సారి అదనంగా 60 సీట్లు గెలుచుకొని మొత్త 180 సీట్లతో పార్లమెంటులో తిరిగి అడుగుపెట్టింది. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు ఓటర్లు గ్లౌసులు వేసుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. లెక్కింపు సమయంలో శానిటైజర్లు, గ్లౌజులు వినియోగించారు. 44 మిలియన్ మంది ఓటర్లున్న దక్షిణ కొరియాలో మూడొంతుల పైగా ఈ పోలింగ్‌లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
tags: south korea, lockdown, national polls, held, social distance