కరోనా డేంజర్ బెల్స్: తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

by srinivas |   ( Updated:2021-04-26 06:16:55.0  )
కరోనా డేంజర్ బెల్స్:  తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను జూన్ 1 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

సికింద్రాబాద్-కర్నూలుఎక్స్‌ప్రెస్ రైలును ఏప్రిల్ 28 నుంచి మే 31వరకు, కర్నూలు-సికింద్రాబాద్ రైలును ఏప్రిల్ 29 నుంచి జూన్ 1 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక మైసూర్-రేణిగుంట ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు, రేణిగుంట-మైసూర్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును మే 1 నుంచి మే 29వరకు, సికింద్రాబాద్-ముంబై ఎల్‌టీటీ సర్వీసును ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed