- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవ్వా.. నువ్వొద్దు.. పో..
దిశ, కరీంనగర్: అనుమానం పెనుభూతమైంది ఆ కొడుకులకు… తల్లికి కరోనా సోకిందని ఇంటినుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచక ఇంటి ముందు కూర్చొని దీనంగా చూస్తోన్నది కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన కట్ట శ్యామల. విషయమేమిటంటే.. బంధువులను చూసేందుకని మహారాష్ట్ర షోలాపూర్ కు శ్యామల వెళ్లింది. లాక్ డౌన్ కు ముందు వెళ్లిన శ్యామల వెంటనే కరీంనగర్ రాలేకపోయింది. సడలింపులు ఇవ్వడంతో కరీంనగర్ వచ్చిన శ్యామలను ఇంట్లోకి రానివ్వడం లేదు. మహారాష్ట్రలో కరోనా విజృంభించడంతో అక్కడి నుండే వచ్చిన తల్లికి కరోనా సోకిందన్న అనుమానంతో ఇంట్లోకి రావొద్దని చెప్తున్నారు కొడుకులు. దీంతో తల్లి ఇంటిముందు కూర్చుంది. చెట్టంత ఎదిగిన ముగ్గురు కొడుకులు ఇంటికి రానివ్వకపోవడంతో ఎక్కడికెల్లాలో దిక్కు తోచక దిక్కులు చూస్తోన్నది. షోలాపూర్ నుంచి వచ్చేటప్పుడే అక్కడి వైద్యులు కరోనా టెస్ట్ లు చేస్తే నెగెటివ్ వచ్చిందని చెప్తున్నా కొడుకులు మాత్రం వినడం లేదు. దీంతో స్థానికులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి వరకు రోడ్డుపై ఉన్న శ్యామలను స్థానిక కార్పోరేటర్ ఎడ్ల సరిత తన ఇంటికి తీసుకెళ్లారు.