- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు కాంగ్రెస్ పాలిత సీఎంలతో సోనియా సమావేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రజారోగ్యానికి కాంగ్రెస్ తరఫున ఎలాంటి సూచనలు ఇవ్వాలి, ఎలాంటి సహకారం అందించాలన్న అంశాలపై చర్చించనున్నారు.
వ్యాక్సిన్ ఎగుమతులపై వెంటనే మారటోరియం విధించాలని, ఇతర వ్యాక్సిన్స్‌కు పాస్ట్ ట్రాక్ అనుమతులు ఇవ్వాలని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ వెంటనే అందిచాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం లేఖ రాశారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ల ఎగుమతులు అంతర్జాతీయ పబ్లిసిటీని పొందేందుకేనా అని ప్రధాని మోడీ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొందని.. ఇది సీరియస్ ఇష్యూ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.