డిజిటల్ బాటలో సోనాక్షి..

by Shyam |
డిజిటల్ బాటలో సోనాక్షి..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనుంది. చివరగా ‘దబాంగ్ 3’ సినిమాలో కనిపించిన భామ.. ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ త్వరలో వెల్లడించనుంది మూవీ యూనిట్.

కాగా సోనాక్షి త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీమా కగ్తి డైరెక్షన్‌లో రాబోతున్న సిరీస్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుంది. ఫాలెన్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సిరీస్ రాజస్థాన్‌లో షూటింగ్ జరుపుకోనుండగా.. జనవరి వరకు చిత్రీకరణ సాగనుంది. కేవలం 35 మంది కాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్న డైరెక్టర్.. ఈ షెడ్యూల్‌లోనే సిరీస్ పూర్తి చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న సిరీస్ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండనుందని టాక్.

Advertisement

Next Story