సిలిండర్ పేలి ఇద్దరి మ‌ృతి

by Sumithra |   ( Updated:2020-03-16 20:30:10.0  )
సిలిండర్ పేలి ఇద్దరి మ‌ృతి
X

పెద్దపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. యశోద(45), రాహుల్(18) అనే తల్లీకుమారుడు రాత్రి నిద్రపోయిన తరువాత సిలిండర్ ఒకసారిగా పేలడంతో వారు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags: gas cylinder blast, crime, ts news

Advertisement

Next Story