- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

దిశ వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే బాధ్యత కేంద్రంలోని బీజేపీదే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. జగన్‌కు చెక్ పెట్టేది మోదీ ప్రభుత్వమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల క్రమంలో కడప జిల్లాలో ఇవాళ సోమువీర్రాజు పర్యటించారు.
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం బీజేపీ చెప్పచేతుల్లో ఉందనేలా సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేశారు. కానీ సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు.
దీంతో సోమ వీర్రాజు వైసీపీ తొత్తు అంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై పలుమార్లు స్పందించిన సోము వీర్రాజు… తాను తొలి నుంచి బీజేపీలో ఉన్నానని, తాను ఏ పార్టీకి తొత్తు కాదని క్లారిటీ ఇచ్చారు.