రాష్ట్రంలో పరువు హత్య కలకలం.. గొడ్డలితో యువకుడిని తెగనరికిన వైనం

by Shiva |   ( Updated:2025-03-28 04:17:33.0  )
రాష్ట్రంలో పరువు హత్య కలకలం.. గొడ్డలితో యువకుడిని తెగనరికిన వైనం
X

దిశ, వెబ్‌డెస్క్/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. ఓ యువకుడు స్నేహితులతో కలసి ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎలిగేడు మండలం ముప్పిరితోటలో రాత్రి గొడ్డలితో దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు, జోష్ణ దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే, ఐదేళ్ల క్రితమే వారి కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. ఈ క్రమంలోనే కొడుకు గురువారం రాత్రి తన స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలను చేసుకుంటున్న క్రమంలో ఒక్కసరిగా గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై అరా తీశారు. అనంతరం ఘటన స్థలాన్ని పెద్దపల్లి డీఎస్పీ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read More..

విష ఆహారం తిని ముగ్గురు పిల్ల‌లు మృతి.. ఘటనపై అనుమానాలు..?

Next Story

Most Viewed