రంగరాజన్‌పై దాడి.. ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి బెయిల్ మంజూరు

by Mahesh |
రంగరాజన్‌పై దాడి.. ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చుకులు (Chief priests of Chilkur Balaji Temple) రంగరాజన్‌ (Rangarajan)పై దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే పూజారిపై దాడి కేసులో ప్రధాన నింధితుడు అయిన వీరరాఘవ రెడ్డి (accused is Veera Raghava Reddy.)ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే రంగరాజన్‌పై దాడి కేసు ప్రధాన నిందితుడికి ఈ రోజు బెయిల్ మంజూరు (Grant of bail) చేసింది. రూ.15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని రాజేంద్రనగర్ కోర్టు (Rajendranagar Court) తెలిపింది. వీర రాఘవ రెడ్డి రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నానని మద్దతు ఇవ్వాలని తన సైన్యంలో భక్తులను జాయిన్ చేయించాలని.. ఫిబ్రవరి 8వ తేదీన రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ కేసులో వీర రాఘవ రెడ్డి (Veera Raghava Reddy)తో పాటు మరికొంతమంది పై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కూడా రిమాండ్ కు తరలించారు. కాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చుకులు రంగరాజన్‌పై దాడి విషయం తెలిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముకులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అలాగే దూరప్రాంతంలో ఉన్న వారు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘగనను తీవ్ర స్థాయిలో ఖండించిన హిందు సంఘాలు సైత వీర రాఘవరెడ్డిపై చర్యలు తీసుకొవాలని సూచించారు.



Next Story

Most Viewed