ప్రతి కాలనీ, బస్తీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలి : సోమేష్ కుమార్

by Shyam |   ( Updated:2021-08-25 06:24:21.0  )
ప్రతి కాలనీ, బస్తీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలి : సోమేష్ కుమార్
X

దిశ, చార్మినార్: చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ పరివార్ టౌన్‌షిప్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. వ్యాక్సిన్ వేసుకోని బస్తీ, కాలనీలను గుర్తించాలని, మొదట ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి మరుసటి రోజు మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అందరికి వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. ప్రతి కాలనీ, బస్తీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు వాక్సినేషన్ వేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో‌ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ హెల్త్ రజ్వి, హైదరాబాద్ కలెక్టర్ ఎల్.శర్మన్, జీహెచ్ఎంసి గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్, అసోసియేషనల్ కమిషనర్ ఆఫ్ హెల్త్ సంతోష్ కుమార్, జీహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ విజయ లక్ష్మి, దక్షిణ మండల జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed