Rizwan: నాకు ఇంగ్లీష్ రాదు.. అయితే మీకేంటి నొప్పి !

by Veldandi saikiran |
Rizwan: నాకు ఇంగ్లీష్ రాదు.. అయితే మీకేంటి నొప్పి !
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చదువుకోలేదని... అందుకే ఇంగ్లీష్ ( Mohammad Rizwan English) కూడా అంతంత మాత్రమే వస్తుందని తాజాగా ప్రకటన చేశారు మహమ్మద్ రిజ్వాన్. సోషల్ మీడియాలో... మహమ్మద్ రిజ్వాన్ ఇంగ్లీష్ పైన దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతాయన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కచ్చితంగా 10 వీడియోలలో రెండు వీడియోలు మహమ్మద్ రిజ్వాన్ ఇంగ్లీష్ గురించే వస్తాయి.

ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు.. చాలా వింతగా మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan) మాట్లాడుతూ ఉంటాడు. ఇంగ్లీష్ ను కిచిడీ చేసి మరి మాట్లాడుతూ ఉంటాడు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ వీడియోలు వైరల్ అవు తుంటాయి. అయితే తన ఇంగ్లీష్ పై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో... తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ స్వయంగా స్పందించాడు. నేను అసలు చదువుకోలేదని... తనకు ఒక్క ముక్క కూడా రాదని వెల్లడించాడు. అందుకే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తడబడుతూ ఉంటానని క్లారిటీ ఇచ్చాడు.

పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా ఉండి కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నందుకు సిగ్గుపడట్లేదని.. వివరించాడు. నా నుంచి మేనేజ్మెంట్ క్రికెట్ కోరుకుంటుంది.. ఇంగ్లీష్ కాదంటూ ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చాడు. ఒకవేళ ఇంగ్లీషే కావాలంటే క్రికెట్ ను వదిలేసి ప్రొఫెసర్ అయ్యుండేవారిని అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మహమ్మద్ రిజ్వాన్. ఇక మహమ్మద్ రిజ్వాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Next Story

Most Viewed