- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం విషాదం.. టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని వస్తున్న ఆరోపణలపై టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత భూమన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు.. టీటీడీ ఎస్వీ గోశాల (TTD SV Goshala)లో గోవులు మృతి (Cows Died) చెందాయంటూ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) ప్రచారం చేస్తున్న అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమని అన్నారు.
శ్రీవారి చరణాల సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడి ట్రస్ట్ బోర్డు (TTD Trust Board) చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమని, వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామని తెలియజేశారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేము, కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగా, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని మండిపడ్డారు.
ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడి గోశాలకు చెందినవిగా చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమని చెప్పారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని మనవి చేశారు. ఇక గోసేవా అంటేనే గోదేవి సేవ అని, ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలని పిలుపునిచ్చారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడి చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని బోర్డు చైర్మన్ ఆకాంక్షించారు.