- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బులిస్తే పనులు.. లేదంటే అంతే
దిశ, ఖమ్మం: ఎన్‌పీడీసీఎల్‌లో ప్రతినెలా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా.. లంచాలు లేకుండా కొంతమంది అధికారులు ఏ పనీ చేయడం లేదు. ఎన్‌పీడీసీఎల్ డివిజన్ కార్యా లయాలు అక్రమార్కులకు నిలయంగా మారింది. ప్రతి నెల వచ్చే జీతాలు డ్రా చేయకుండా లంచాలు పేరుతో వసూళ్లు చేసున్న డబ్బులతోనే నెల వారి ఖర్చలు చేస్తున్నారు. ఉద్యోగంలో వచ్చి అతి తక్కువ కాలంలోనే ఆస్తులను కూడపెట్టుకుంటున్నారు. జిల్లాకు వచ్చిన ప్రతి అధికారి కోట్లల్లో సంపాదించుకుంటున్నారు. ఎన్‌పీడీసీఎల్‌లో జరుగుతున్న విద్యు త్ అధునీక పనులకు నేరుగా బినామీలను పెట్టి పనులు చేస్తున్నారు. దాంతో పాటు కాంట్రాక్టర్ల వద్ద డబ్బులిస్తే పనులు… లేదంటే అంతే అంటూ బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు.
జిల్లాలో వ్యాపారంతో పాటు పరిశ్రమలు తరలిరావడం అలాగే ఖమ్మం నగరంలో రోజురోజుకి అభివృద్ధి చెందుతుండటంతో విద్యుత్ పరంగా అవసరాలు పెరిగాయి. ప్రభుత్వం రోజుకు 24 గంటల సరఫరా జరుగుతుండడంతో క్షేత్రస్థాయిలో రూ.కోట్లు విలువైన పనులు జరుగుతున్నాయి. ఇది సంస్థలోని క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులకు కలిసి వస్తోంది. ఎన్‌పీడీసీఎల్ సంస్థ పనులను కాంట్రాక్టర్లతో చేయిస్తుంది. కొందరు అధికారులే బినామీ కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని పనులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, ఖమ్మం నగరం, ఖమ్మం(రూరల్), ప్రాంతాల డీఈలతో ములాఖత్ అయి అనుమానం రాకండా అక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌లు ఇక్కడ, ఇక్కడి వారిని అక్కడ పనులు కల్పిస్తూ జేబులు నింపుకుంటున్నట్లు స్థానికంగా పనులు దక్కని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
అక్రమార్కులకు నిలయంగా కార్యాలయాలు..
జిల్లాలోని ఎన్‌పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో ఏటా సుమారు రూ. లక్షల కోట్ల విద్యుత్ నిర్మాణ పనులు జరగుతున్నాయి. ఇవన్నీ ఆయా సెక్షన్ పరిధిలో ఉన్న డీఈ కార్యాలయం పరిధిలో అంచనాలు తయారుచేసి పనులు చేపట్టాల్సి ఉంది. డీఈ రూ.లక్ష వరకు నామినేషన్, అగ్రిమెంట్ పద్ధతిలో ఏ కాంట్రాక్టర్లకైనా పనులను అప్పగించవచ్చు. అంచనా వ్య యం పెరగకుండా పనులను విభజించి రూ.లక్ష పనులను పలువురికి ఇస్తుండటం గమనార్హం. జిల్లా పరిధిలో 50 నుంచి 70 మంది కాంట్రాక్టర్లు పనులు చేపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రా, ఇతర ప్రాంతాల కాంట్రాక్టరు పనులు దక్కించుకుని వాటిని చేస్తుండడంతో స్థానిక గుత్తేదారులకు పనులు లేకుండా పోయాయి. ఈ విషయమై అధికారులకు గుత్తేదారులకు గొడవలు పెటుకున్న సంద ర్భాలు అనేకం.
ఎన్‌పీడీసీఎల్‌లో ప్రతి పనికి ధరను ఖరారు చేసి బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 33, 11 కేవీ లైన్ల నిర్మాణం, మార్పు, నియంత్రికల ఏర్పాటు, మీటర్ల బిగింపు, సబ్‌స్టేషన్ల నిర్వహణ, చెట్టు కొ మ్మల కటింగ్, రవాణా పేరిట జిల్లాలోని కొందరు ఏఈలు, ఏడీఈలు, డీఈ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పనుల అంచనా విలువలో కార్యాలయ ఖర్చులు, ఇతర స్థాయిల వారీగా 10 నుంచి 14 శాతం లంచాల రూపంలో తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంద స్తుగా డబ్బులు తీసుకుని కొన్ని పనులు నేరుగా మంజూరు చేస్తున్నట్లు సమాచారం. డబ్బులు ఇవ్వని వారికి బిల్లుల మంజూరులో ఇబ్బందులు పెడ్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఏడీఈలను పక్కన బెట్టి కొందరు ఏఈలు, మరి కొందరిని ఏజెంట్లుగా పెట్టుకుని చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో సంస్థకు రూ.లక్షల నష్టం వాటిల్లుతుండడం గమనార్హం. అవసరం లేకున్నా పనులు సృష్టించడం, తమకు అనుకూలంగా ఉన్న వారికి పనులు కట్టబెట్టడం ద్వారా ప్ర జాధనం దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. సంస్థలో చేపడుతున్న పనులు, నిర్మాణాలు, బిల్లుల మంజూరు ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు చేసిన పక్షంలో మ రిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని కొంత మంది అధికారులు తెలుపుతున్నారు.