కరోనా నివారణకు సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి

by Shyam |   ( Updated:2020-03-29 02:49:04.0  )
కరోనా నివారణకు సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రజలు అవగాహన కలిగి ఉండి, సామాజిక దూరం పాటిస్తే ఆ మహమ్మారిని అరికట్టవచ్చని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం వీపనగండ్లలో 30 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. హాస్పిటల్‌లోని సౌకర్యాలపై వైద్యులు షబానా తస్లీమ్, లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్డార్ హాస్పిటల్ పరిసరాలను పరిశీలించి వెళ్లారని డాక్టర్ షబానా తస్లీమ్ ఎమ్మెల్యేకు వివరించారు.

TAGS :Social Distance, best, Coronavirus, prevention, MAHABUBNAGAR

Advertisement
Next Story

Most Viewed