- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
iPhone : ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే.. ఆ వస్తువులు డెలివరీ
దిశ, డైనమిక్ బ్యూరో : విజయదశమి సందర్భంగా పలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ భారీగా ఆఫర్లు ప్రకటించాయి. దాంతో తక్కువ ధరకే వస్తు్న్నాయని చాలా మంది యూజర్లు ఇంటికి కావాల్సిన వస్తువులు, మొబైల్ ఫోన్లు కొంటున్నారు. అయితే, ఈ ఆఫర్‌లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి మోసం జరిగింది.
మధ్యతరగతి వ్యక్తులకు అందనంత దూరంలో ఉండే ఐఫోన్‌ను తక్కువ ధరకే వస్తుందని సిమ్రన్‌పాల్ సింగ్అనే యువకుడు ఫ్లిప్ కార్ట్ ఆన్‌లైన్ సైట్‌లో ఆర్డర్ చేశారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా.. రూ.53 వేలకు యాపిల్ ఐఫోన్12ను బుక్ చేశాడు. కొన్ని రోజులకు కొరియర్ రావడంతో తన సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. తన సంతోషాన్ని స్నేహితులతో పంచుకునేందుకు ముందుకు వచ్చారు. కానీ, సింగ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఎంతో ఇష్టంగా ఓపెన్ చేసిన కొరియర్ బాక్స్‌లో రెండు సబ్బులు దర్శనమిచ్చాయి. అప్రమత్తమయిన యువకుడు, యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేసి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. దీనిపై ఫ్లిప్ కార్ట్ స్పందించి పొరపాటు జరిగిందని సింగ్ చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చేసింది.