‘హెరాన్’ గొంతును చీల్చుకొచ్చిన పాము..

by Shyam |
‘హెరాన్’ గొంతును చీల్చుకొచ్చిన పాము..
X

దిశ, వెబ్‌డెస్క్: కొంగ జాతికి చెందిన హెరాన్ పక్షి చేపల్ని తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ఈ హెరాన్ ఇటీవల ఓ ఈల్ స్నేక్‌ను మింగేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హెరాన్ పక్షి బతికే ఉందా? ఈల్ స్నేక్ హెరాన్‌ కడుపులో జీర్ణం అయ్యిందా? ఓ లుక్కేద్దాం..

అమెరికా, మేరిల్యాండ్‌కు చెందిన సామ్‌ డేవిస్‌ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఓ అద్భుతమైన ఫొటోను తీశాడు. ఆకాశంలో ఎగురుతున్న హెరాన్ పక్షి గొంతును చీల్చుకుని ఓ ఈల్ స్నేక్ బయటకు వచ్చింది. దాన్ని డేవిస్ అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. ఈ సన్నివేశాన్ని డేవిస్ కూడా నమ్మలేకపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన , వీడీయోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

‘‘స్నేక్ ఈల్స్ ఎక్కువగా సముద్ర తీరాల్లోని బురద, ఇసుక ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఏదైనా జీవి వీటిని సజీవంగా తిన్నప్పుడు అవి తమ పదునైన తోకను ఉపయోగించి బయటపడటానికి ప్రయత్నిస్తాయి. ఈల్‌ పొట్టను చీల్చినా హెరాన్‌ బతికి ఉండటం అశ్చర్యంగా ఉంది. నేను ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడూ చూడలేదు’’ అని సామ్ డేవిస్ తెలిపాడు.

Next Story

Most Viewed