- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీరప్పన్ కూతురికి బీజేపీ యువమోర్చా పదవి
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలను గంధపుచెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో గడగడలాడించిన వీరప్పన్ కూతురు విద్యారాణికి బీజేపీ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. తమిళనాడులో లాయర్‌గా పనిచేస్తున్న ఆమె కొన్నాళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. బీజేపీలో కొన్నాళ్లుగా యాక్టివ్ గా పనిచేస్తున్న విద్యారాణికి ఈ పదవి దక్కడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యారాణికి బీజేపీ మరింతగా ప్రోత్సాహం అందిస్తోంది. బీజేపీ తమిళనాడు యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించింది. విద్యారాణి గత ఫిబ్రవరిలోనే తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణగిరి ప్రాంతంలో వీరప్పన్ వర్గానికి ఉన్న ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతా భావిస్తున్నారు. ఇదిలాఉండగా, తన జీవితకాలంలో అత్యధిక రోజులు అడవుల్లో జీవనం సాగించిన వీరప్పన్ తన కుమార్తెను జీవితంలో ఒకే ఒక్కసారి కలిశాడని సమాచారం.