- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మృతి ఇరానీ లైఫ్ లెస్సన్స్
దిశ, వెబ్‌డెస్క్ :
తన నటన, నడవడికతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. చిన్నప్పటి నుంచి తను హీరోగా ఎదిగేంత వరకు పోరాటపటిమ ప్రదర్శించిన సుశాంత్.. ఎందుకో ఆ పోరాటాన్ని మధ్యలోనే వదిలేసి శాశ్వత సెలవు తీసుకున్నాడు. సుశాంత్.. పిరికివాడైతే కాదు ! అంత బలహీనుడు కూడా కాదు.. మరెందుకు? ఎన్నో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఆ గుండె.. ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో లక్షల మంది అభిమానుల్లో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ క్రమంలో సుశాంత్ మృతిపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ‘మాటలు రావడం లేదు. నువ్వు ఎందుకు ఈ జీవితాన్ని వదిలివెళ్లావో నాకర్థం కావడం లేదు. యంగ్ కిడ్‌గా వచ్చావు.. స్టార్‌గా మారావు.. జాతి గర్వపడేలా చేశావు. ఇప్పటికే ఎంతో దూరం ప్రయాణించావు.. ఇంకా ఎన్నో మైళ్లు ప్రయాణించాల్సి ఉంది. యు విల్ బీ మిస్స్‌డ్.. సుశాంత్’ అని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. స్మృతి ఇరానీ ఇన్‌స్టా వేదికగా కొన్ని ‘లైఫ్ లెస్సెన్స్’ను షేర్ చేసుకున్నారు.
1. ‘నీకు జీవితాన్ని ఇచ్చింది.. నువ్వు ఎంతో ధైర్యంగా ఆ జీవితాన్ని జీవిస్తావని’ అని తొలి కోట్ షేర్ చేసింది. నిజమే మరి.. బలహీనులైతే జీవితంలో వచ్చే ఒడిదొడుకులను, కష్టనష్టాలను ఎదుర్కోగలరా? లేదు కదూ. జీవితమనే ప్యాకేజ్‌లో అన్నీ ఉంటాయి. పోరాడుతూ.. ముందుకు వెళ్లాలంతే.
2. ‘బిగ్గరగా ఏడ్వు.. ఇంకా ఇంకా ఏడ్వు కానీ.. వదిలిపెట్టకు’ అని రెండో మెసేజ్ పెట్టింది. పుట్టిన ప్రతి మనిషికి కష్టాలుంటాయి. అంతమాత్రాన.. జీవితాన్ని వదిలి వేయాలా? లేదు. మనసుకు బాధ అనిపిస్తే.. ఆ పెయిన్ పోయే వరకు ఏడ్వు.. లేదా ఆ పెయిన్ తగ్గిపోయేలా ఇంకా ఏదైనా చేయు. కానీ ఆ బాధలోనే ఉండిపోకు. దాని వల్ల జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేయకు.
3. ‘జీవితంలో కొన్ని అలవాట్లను అలవర్చుకుంటాం. కానీ జీవితాంతం వాటినే పట్టుకుని వేలాడకూడదు. వాటికీ ఎక్స్‌పైర్ డేట్ ఉంటుంది. జీవితం కొత్తగా ఉండాలంటే… కొత్త అలవాట్లు మార్చుకోవాలి. కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి’ అని మూడో లైఫ్ లెస్సన్ షేర్ చేశారు. ఇది అక్షరాలా సత్యం. జీవితంలో ముందుకు సాగాలంటే.. పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ.. ఆధునీకరించుకుంటూ వెళ్లాలి.. లేకపోతే అక్కడే ఆగిపోతాం. ఒకప్పుడు నోకియా ఫోన్ హవా నడిచింది. కానీ ఆ తర్వాత రాబోయే టెక్నాలజీని అందిపుచ్చుకోలేక.. మార్కెట్లో వెనుకబడిపోయింది. మిగతా మొబైల్ కంపెనీలు ముందు చూపుతో దూసుకుపోయాయి. జీవితం కూడా అంతే. బీ రియలిస్టిక్.