- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: స్మాల్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల(ఎస్‌యూవీ)కు విపరీతమైన డిమాండ్ కారణంగా వీటి ధరలు కూడా గత మూడేళ్లలో లేనంత స్థాయిలో పెరిగాయి. ప్రముఖ ఆటోమొబైల్ అధ్యయన సంస్థ జాటో సేకరించిన వివరాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీల ధరలు ఈసారి 11 శాతం పెరిగాయని వెల్లడించింది. ఇతర విభాగాలైన హ్యాచ్‌బ్యాక్ 4 శాతం పెరగ్గా, మల్టీ పర్పస్ వెహికల్(ఎమ్‌పీవీ) 9 శాతం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 3.5 శాతం, ప్రీమియం సెడాన్ 8 శాతం, భారీ ఎస్‌యూవీల ధరలు 9 శాతం పైగా పెరిగాయి. ముఖ్యంగా, ఈ కార్ల ధరల పెరుగుదలకు నిర్వహణ ఖర్చులు, ముడిసరుకు ధరల పెరుగుదల వల్లేనని జాటో తెలిపింది.
‘ఒరిజినల్ పరికరాల తయారీదారుల వద్ద ధరలు ఒక్కో విభాగంపై ఒక్కోలా ప్రభావాన్ని చూపించాయి. సెడాన్ వాహనాలకు వాడే పరికరాల ధరలు తగ్గగా, స్మాల్ ఎస్‌యూవీల ధరలు పెరిగాయి. మల్టీ పర్పస్ వాహనాల ధరలపై కూడా ఈ ప్రభావం ఉంది. ధరల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ మల్టీ పర్పస్ వాహనాలతో ప్రయోజనాలను వినియోగదారులు కావాలనుకుంటున్నారని’ జాటో ఇండియా హెడ్ రవి భాటియా చెప్పారు. ‘చిన్న, పెద్ద ఎస్‌యూవీల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ ఏ మాత్రం తగ్గటంలేదు. ఈ విభాగంలో మరిన్ని మోడళ్లను వారు కోరుకుంటున్నారు. తయారీ కంపెనీలు కూడా ఇందులో మరిన్ని మోడళ్లను విడుదల చేయాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్‌యూవీ వాహనాల అమ్మకాలు సెడాన్, కాంపాక్ట్ కార్ల కంటే ఎక్కువగా వృద్ధిని సాధిస్తున్నాయని రవి భాటియా వివరించారు. ‘కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మెరుగైన ఫీచర్లతో లభించే విభాగం. అయితే, ఈ విభాగంలో ఒరిజినల్ పరికరాల తయారీదారులు ధరల పెంపు వల్ల కొంత ఇబ్బందులు తప్పవని’ ఇక్రా వైస్-ప్రెసిడెంట్ ఆశీష్ మోదానీ చెప్పారు.