ప్రగతి భవన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యా‌యత్నం

by Shyam |
ప్రగతి భవన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యా‌యత్నం
X

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది అనడానికి ఇప్పుడు చెప్పే ఘటనే ఓ ఉదాహరణ. పాతబస్తీకి చెందిన నజీరుద్దీన్ చిరు వ్యాపారి. రోడ్డు పక్కన చిన్న చెప్పుల దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా విజృంభణతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో తన చెప్పుల దుకాణం మూతపడింది. ఇప్పటికే దాదాపు 60 రోజులు కావొస్తోంది. కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు నజీరుద్దీన్‌కు. తనలాంటి చిరు వ్యాపారుల బాధలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురాలనుకున్నాడో లేక కుటుంబాన్ని పోషించలేకనో మరి.. నేరుగా సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నాడు. ఉన్నట్టుండి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది గమనించిన పోలీస్ సిబ్బంది నజీరుద్దీన్‌ను అడ్డుకున్నారు. అనంతరం అతన్ని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed