బెంగాల్‌లో ఆరో విడత పోలింగ్ షురూ..

by Shamantha N |
బెంగాల్‌లో ఆరో విడత పోలింగ్ షురూ..
X

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో భాగంగా ఆరో విడత ఎన్నిక గురువారం ప్రారంభమైంది. 43 నియోజకవర్గాలలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర దీనాజ్‌పూర్, నాడియా, నార్త్ 24 పరగణాస్, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతున్న ఈ ఎన్నికలలో 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1.03 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందుకు గాను ఎన్నికల కమిషన్ 10,897 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బెంగాల్ లో ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా.. ఇది ఆరోది. మరో రెండు విడతలు మిగిలిఉన్నాయి. ఈ నెల 26న ఏడో విడత, 29న ఎనిమిదో విడత పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉత్తర నాడియా జిల్లా కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నాయకుడు బరిలో ఉన్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లా నుంచి చంద్రిమా భట్టాచార్య, జ్యోతిప్రియా మాలిక్‌లు పోటీలో ఉన్న ప్రముఖులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు పోలింగ్ కొనసాగనుంది.

Advertisement

Next Story

Most Viewed