చౌటుప్పల్‌లో ఆరు పాజిటివ్ కేసులు..

by Shyam |
చౌటుప్పల్‌లో ఆరు పాజిటివ్ కేసులు..
X

దిశ, మునుగోడు: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో బుధవారం 40 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీంతో బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed