సీఏ ఆల్ ఇండియా ఫలితాల్లో చెల్లికి ఫస్ట్.. అన్నకు 18వ ర్యాంక్

by Shamantha N |
CA All India Results
X

దిశ,డైనమిక్ బ్యూరో : సీఏలో ర్యాంకు సాధించేవారు జిల్లాకు ఒకరు ఉండటం కూడా అరుదు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ర్యాంకు సాధించి అందరి మెప్పు పొందుతున్నారు. అదీ కూడా ఆల్ ఇండియాలో టాప్ 20లో ర్యాంకు సాధించడంతో ప్రశంసలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మొరెనా జిల్లాకి చెందిన నందిని అగర్వాల్(19), సచిన్ అగర్వాల్(21) అన్నాచెల్లెలు. వీళ్లు విక్టర్ కాన్వెంట్ స్కూల్‌లో 2017లో ఇంటర్ పూర్తి చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండే నందిని చిన్నప్పుడే రెండు తరగతులు జంప్ చేసి అన్నతో సమానంగా విద్యనభ్యాసిస్తోంది. అయితే నందిని 800 మార్కులకు గాను 614 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించగా.. సోదరుడు సచిన్ అగర్వాల్ 18వ ర్యాంకు సాధించారు. కాగా, చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం దేశ వ్యాప్తంగా 83,606 మంది అభ్యర్థులు పరీక్ష చేశారు.

Advertisement

Next Story