శింబు.. చెఫ్ అవతార్

by  |
శింబు.. చెఫ్ అవతార్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ సూపర్ స్టార్ శింబు.. 2019లో ‘వంత రజావాతన్ వరువే’ సినిమాతో చివరగా ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం మహా, మానాడు చిత్రాల్లో నటిస్తున్న శింబు.. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదాపడటంతో అందరు సెలబ్రిటీల మాదిరిగానే ఇంట్లోనే ఉంటున్నారు. కాగా హీరోగా ఎప్పుడూ బిజీ లైఫ్ గడిపే శింబు.. లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడట. అంతే కాదండోయ్.. లాక్‌డౌన్ స్టార్టయినప్పటి నుంచి చెఫ్ అవతారం ఎత్తాడట ఈ స్టార్ హీరో.

రోజూ మూడు పూటలా తల్లిదండ్రులతో పాటు తన అసిస్టెంట్లకు కూడా తనే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడట. మొత్తానికి శింబు వంట రుచిని ఆస్వాదిస్తూ.. అతని పేరెంట్స్ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారట. ఇక పూర్తిగా చెఫ్ అవతారమెత్తిన శింబు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తమ అభిమాన హీరోలో మరో కోణాన్ని చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక యూఆర్. జమీల్ దర్శకత్వంలో శింబు నటిస్తున్న మహా చిత్రంలో హన్సిక హీరోయిన్ కాగా.. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ‘మానాడు’ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ శింబుకు జోడీగా కనిపించనుంది.


Next Story

Most Viewed