రైతుల కోసం సిక్కు మతపెద్ద సూసైడ్

by Shamantha N |
రైతుల కోసం సిక్కు మతపెద్ద సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దులో సిక్కు మతపెద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకొని సంత్ బాబా రామ్‌సింగ్ (65) సూసైడ్ చేసుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల బాధ, కేంద్రం వ్యవహరిస్తున్న తీరును చూడలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అన్యాయం చేయడం పాపమైతే, దాన్ని చూస్తూ సహించడం మహాపాపం అని లేఖలో స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆయన సొంతూరు హర్యానాలోని కర్నల్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Next Story