- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
80 శాతం తగ్గిన ట్రిపుల్ తలాక్ కేసులు : అబ్బాస్ నఖ్వీ
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ముస్లిం మహిళల పట్ల చేసే తక్షణ తలాఖ్ కేసులు తగ్గాయని కేంద్ర మైనారిటి వ్యవహరాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఆగష్ట్ ఒకటో తేదీ నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నఖ్వీ మీడియాతో మాట్లాడారు. దీనిని ముస్లిం మహిళల హక్కుల దినోత్సవంగా అభివర్ణించారు.
వేలాది మంది స్త్రీలు ఈ చట్టం రావడటం పట్ల హర్షం వ్యక్తం చేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలోని ముస్లిం మహిళల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసిందన్నారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావడం ద్వారా వారికి రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక,ప్రజాస్వామ్య హక్కులను కాపాడినట్లైందని నఖ్వీ చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ ను సామాజిక దురాచారంగా నఖ్వీ వర్ణించారు.
అయితే చట్టం అమల్లోకి రావటంతో 80 శాతం పైగా కేసులు తగ్గిపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారం అప్పటికప్పుడు చెప్పే తలాఖ్ లు ఇక చెల్లవు. ఎవరైన ఉల్లఘిస్తే కఠినంగా శిక్షించేలా నిబంధనలు ఉన్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గోనడానికి వచ్చిన సందర్భంగా నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మతి ఇరానీ పాల్గోన్నారు.