- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జీతాల్లో కోతపై సింగరేణి కార్మికుల ఆందోళన

X
దిశ, ఆదిలాబాద్: వేతనాల్లో కోతను నిరసిస్తూ సింగరేణి కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కార్మికులు, ఏఐటీయూసీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన ఓసీపీ-1 మొదటి షిఫ్ట్ కార్మికులు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. కార్మికుల ఆందోళనతో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై రావును పోలీసులు వదిలేశారు. అయినా, తమ ఆందోళన విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.
Tags: singareni,workers,protest,memorandum
Next Story