- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థుల సందేహాల నివృత్తికి అవకాశం
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని 8,9,10వ తరగతులకు చెందిన విద్యార్థులు వివిధ సబ్జెక్టులపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్టు సిద్దిపేట విద్యాశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రెండో శనివారం మరియు ఇతర ప్రభుత్వ సెలవులను మినహాయించి ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ T-SAT నిపుణ ఛానల్ ద్వారా గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో రాష్ట్ర స్థాయి నిపుణుల ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయం తెలియజేసి తమ పాఠశాల పరిధిలో ఎంతమంది విద్యార్థులు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు అనే విషయాన్ని సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా మండల విద్యాధికారులకు అందజేయాలనీ కోరారు.