కరోనా నివారణకు సిద్దిపేట వైద్యుల విరాళం

by Shyam |

దిశ, మెదక్: కరోనా కట్టడి కోసం సిద్దిపేట వైద్యులు సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం చెక్కులను మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శంకర్‌రావు మాట్లాడుతూ ప్రజలకు వైద్యాన్ని అందించడంతోపాటు కరోనా నివారణకు కృషి చేస్తున్నప్రభుత్వానికి సహకరిస్తూ తమవంతుగా విరాళాలు పోగు చేసినట్టు తెలిపారు. సిద్ధిపేట జిల్లా ఐఏంఏ ఆధ్వర్యంలో ప్రతి సభ్యుడు రూ. 10 వేల చొప్పున రూ. 3 లక్షలు, ప్రముఖ వైద్యుడు సురేంద్ర రూ. 1.80 లక్షలు అందించారని చెప్పారు. వైద్యుల తరఫున రూ. 7 లక్షలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డాక్టర్ సముద్రాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, వైద్యులు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Siddipet,IMA,Minister,Harish rao,CMRF donations


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed