చంద్రబాబు, పవన్ మరో సంచలన నిర్ణయం.. 38 మందికి కీలక పదవులు

by srinivas |   ( Updated:2025-04-04 13:10:43.0  )
చంద్రబాబు, పవన్ మరో సంచలన నిర్ణయం.. 38 మందికి కీలక పదవులు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ(Tdp), జనసేన(Janasena), బీజేపీ(Bjp) కోసం కష్టపడి పని చేసి పదవులు కోసం ఆశలు పెట్టుకున్నవారికి గుడ్ న్యూస్ తెలిపారు. గత ఎన్నికల్లో సీట్లు రాకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం చాలా మంది కీలక నేతలు తీవ్రంగా కృషి చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపుల్లో ప్రధాన పాత్ర పోషించారు. అయితే వీరందరినీ దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు, పవన్ ఇప్పటికే కొందరికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కట్టబెట్టారు.

ఇప్పుడు మరికొన్ని పదవులకు నేతలను నియమించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆ లిస్టును విడుదల చేశారు. తాజాగా 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు 31 పదవులు, జనసేనకు 6, బీజేపీకి ఒక స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కొన్ని మార్కెట్ కమిటీలు మిగిలి ఉండటంతో వాటిని కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కసరత్తులు చేయనున్నారు. తాజా జాబితాలో పేర్లు లేని నేతలు మిగిలిన పోస్టుల్లోనూ తమకు అవకాశం దక్కుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.



Next Story