Kadiyam Srihari : బీఆర్ఎస్ నాశనం అయిందే పల్లా రాజేశ్వర్ రెడ్డి వల్ల : కడియం శ్రీహరి

by M.Rajitha |
Kadiyam Srihari : బీఆర్ఎస్ నాశనం అయిందే పల్లా రాజేశ్వర్ రెడ్డి వల్ల : కడియం శ్రీహరి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Congress MLA Kadiyam srihari) మరోసారి బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కేసీఆర్(KCR) వల్లే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి కడియం శ్రీహరి చేసింది శూన్యం అని బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాజాగా పల్లా రాజేశ్వర్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కడియం పేర్కొన్నారు. పల్లా మాటల్లో పూర్తిగా అహంకారం కనిపిస్తోంది తప్ప ఏ మాత్రం నిజం లేదని మండిపడ్డారు. 24 గంటలూ కేసీఆర్ వెంట ఉండి.. ఆయనను, బీఆర్ఎస్ పార్టీ(BRS Party)ని సర్వ నాశనం చేసింది పల్లా రాజేశ్వర్ అని ఆరోపణలు చేశారు.

పల్లా మాటలు విని కేసీఆర్ పరిపాలన పక్కదారి పట్టిందని, అందుకే తెలంగాణ ప్రజలు కర్రుకాల్చివాత పెట్టారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్న పల్లాకు నా గురించి మాట్లాడే హక్కు లేదని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ది ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. అధికారం పోయినా ఇంకా అహంకారపు మాటలు తగ్గలేదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed