- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిలాఫలకానికి పరిమితం.. ఇది సిద్ధిపేట జిల్లాలో..
దిశ, హుస్నాబాద్ : పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి, బేగంపేట, దాచారంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పలు శాఖల ఉన్నతాధికారులు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వాటి వైపు తిరిగి చూడలేదు. గ్రామాల్లో ఇండ్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రజాపత్రినిధులతో జిల్లా, మండల స్థాయి ఆఫీసర్లతో పలు మార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి.. 2018 జులై 23న కల్లెపల్లి, 2018 జులై 17న బేగంపేట గ్రామంలో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం వేసి సుమారు రెండేండ్లు పుర్తయినా దానికి పునాది సైతం తియ్యలేదు. డబుల్ ఇండ్లు నిర్మించేందుకు మొదట శంకుస్థాపన చేసేందుకు ఓ గద్దెను నిర్మించాల్సి ఉంది. కల్లెపల్లి గ్రామంలో అధికారులు గద్దెను నిర్మించకుండా ప్రక్కనే ఉన్న ఓ ఇంటికి శిలాఫలకం బిగించారు. దాచారం గ్రామంలో 2018 మార్చి 24వ తేదీ రూ.110.80లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలి: రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు
మండల పరిధిలోని పలు గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు మొదలుకాలేదు. కేవలం శిలాఫలకాలకు మాత్రమే పనులు పరిమితమయ్యాయి. వాటి నిర్మాణానికి వెంటనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలి. బెజ్జంకి, శీలాపూర్ గ్రామంలో పూర్తి చేసిన డబుల్ ఇండ్లను ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలోగ్గకుండా అర్హులకు మాత్రమే పంపిణీ చేయాలి.
ఆర్భాటాలకే పరిమితం: సంగెం మధు, సీపీఐ నాయకులు
పాలకులు ప్రారంభోత్సవాలకు హంగూ ఆర్భాటాలు చేస్తున్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తున్నారు. ప్రజల ఓట్లు రాబట్టేందుకే పలు గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను శిలాఫలకాలను ప్రారంభించారు. అంచనా వ్యయం సైతం లేకుండా శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.