శృతి ఏం చెప్తుందో..!

హీరోయిన్ శృతి హాసన్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన సినిమాల గురించి అప్‌డేట్స్ ఇస్తూనే.. వంటలు, మేకప్ గురించి టిప్స్ కూడా ఇస్తుంటుంది. తాజాగా లాక్‌డౌన్‌లో ఒంటరిగా ఎలా ఉంటారో ఓ వీడియో షేర్ చేసిన శృతి.. కొత్తగా మరో అప్‌డేట్ ఇస్తానని ప్రకటించింది.

‘ఆగస్ట్ 8న ఓ విషయం చెబుతాను’ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ఆ విషయం ఏమై ఉంటుందా! అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ సినిమా గురించా? లేక సింగింగ్ గురించా? లేక మరేదైనా వెబ్ సిరీస్ గురించా? అని చర్చించుకుంటున్నారు.

కాగా, ఈ విషయాన్ని శృతి ఫ్రెండ్ రానా దగ్గుబాటి, నమ్రత శిరోద్కర్‌తో పాటు చాలా మంది నటీనటులు తమ స్టోరీస్‌లో షేర్ చేశారు. శృతి మేము కూడా ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి ఎదురు చూస్తున్నామని తెలిపారు.

Advertisement